పెద్ద కరెన్సీ నోట్ల మార్పుపై విచారణకు సుప్రీం నిరాకణ

by Disha Web Desk 2 |
పెద్ద కరెన్సీ నోట్ల మార్పుపై విచారణకు సుప్రీం నిరాకణ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద కరెన్సీ నోట్ల(రూ.500, రూ.1000)ను మార్చుకునే అవకాశం కల్పించాలని కోరుతూ విడివిడిగా దాఖలయ్యే పిటిషన్​లను విచారించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, విక్రమ్ నాథ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పిటిషనర్లు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించింది. వారి అభ్యర్థనలపై కేంద్రం 12 వారాల్లోగా సమాధానమివ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

తమ వ్యక్తిగత కేసులలో ప్రభుత్వం చెప్పే సమాధానంతో పిటిషనర్లు సంతృప్తి చెందకపోతే హైకోర్టును ఆశ్రయించాలని రాజ్యాంగ ధర్మాసనం సూచించింది. 2016 నవంబర్​లో రూ. 1000, రూ. 500 కరెన్సీ నోట్లను కేంద్రం రద్దు చేసింది. నాడు ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫలితంగా రాత్రికి రాత్రే..రూ. 10లక్షల కోట్ల సంపద సర్క్యులేషన్​ నుంచి తుడిచిపెట్టుకుపోయింది. ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా 58 పిటిషన్లు దాఖలయ్యాయి. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడం, నకిలీ కరెన్సీని అరికట్టడం, నల్ల ధనాన్ని వెలికితీయడమే లక్ష్యంగా నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.

Next Story

Most Viewed