ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.. విడాకులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

by Disha Web Desk 2 |
ఇక వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.. విడాకులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సుప్రీంకోర్టు విడాకుల ప్రక్రియను సులభతరం చేసింది. మళ్లీ ఒక్కటయ్యే అవకాశాలు లేని జంటలకు వెంటనే విడాకులు మంజూరు చెయ్యొచ్చని పేర్కొంది. ఈ క్రమంలోనే విడాకుల కోసం ఆరు నెలలు వేచి ఉండాలన్న నిబంధనను ఎత్తి వేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఏ.ఎస్. ఒకా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జే.కే. మహేశ్వరిలతో కూడిన కాన్స్టిట్యూషన్ బెంచ్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. హిందూ వివాహ చట్టం సెక్షన్ 13బీ ప్రకారం విడాకులు కోరుకునే జంట ఆరు నెలలు ఎదురు చూడాల్సి ఉంటుందన్న నిబంధనపై విచారించేందుకు ఏర్పాటైన ఈ బెంచ్ రాజ్యాంగంలోని 142 వ అధికారణం ప్రకారం కోర్టుకు ఉన్న విశేష అధికారంతో పౌరుల ప్రాథమిక హక్కులను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు పేర్కొంది.

Next Story