Varavara Rao: వరవరరావుకు బెయిల్ మంజూరు.. షరతు విధించిన సుప్రీంకోర్టు

by Disha Web Desk 2 |
Supreme Court Grants Bail to Varavara Rao On Medical Grounds
X

దిశ, వెబ్‌డెస్క్: Supreme Court Grants Bail to Varavara Rao On Medical Grounds| మహారాష్ట్ర బీమా కోరేగావ్ కుట్ర కేసులో విరసం నేత వరవరరావుకు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. వైద్య పరమైన కారణాలతో ఆయనకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన సాధారణ బెయిల్ మంజూరు చేసింది. గ్రేటర్ ముంబై విడిచి ఎక్కడికి వెళ్లరాదని షరతు విధించింది. అలాగే వైద్య చికిత్స వివరాలను ఎన్‌ఐఏకు అందించాలని కోర్టు ఆదేశించింది. వరవరరావు సాక్షులతో సంబంధాలు పెట్టుకోవద్దని, కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ప్రయత్నించవద్దని కోర్టు ఆదేశించింది. భీమా-కోరేగావ్‌ కేసులో 2018లో వరవరరావు అరెస్ట్ అయ్యారు. సుధీర్ఘ కాలం జైల్లో ఉన్న ఆయన కొవిడ్ సమయంలో బెయిల్ కోసం పలుమార్లు బాంబే హైకోర్టును ఆశ్రయించి చివరకు బెయిల్ పొందారు. అయితే తన వయసు, ఆరోగ్య రీత్యా తనకు శాశ్వత బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత జులై 19న ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆగస్ట్ 10కి వాయిదా వేసింది. ఇవాళ ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. ఆరోగ్య కారణాల రీత్యా వరవరరావుకు ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది.

ఇది కూడా చదవండి: 'డిసెంబరే బెంగాల్ ప్రభుత్వానికి చివరి నెల'



Next Story

Most Viewed