ఎన్నికల నిర్వహణ పవిత్రంగా ఉండాలన్న సుప్రీంకోర్టు

by S Gopi |
ఎన్నికల నిర్వహణ పవిత్రంగా ఉండాలన్న సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల నిర్వహణలో పవిత్రత ఉండాలని భారత అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూసేందుకు అనుసరించిన చర్యలను వివరించాలని కోరుతూ సుప్రీంకోర్టు గురువారం భారత ఎన్నికల సంఘానికి తెలిపింది. 'ఇది ఎన్నికల ప్రక్రియ. పవిత్రత ఉండాలి. ఆశించిన విధంగా జరగడం లేదని ఎవరూ ఆందోళన చెందకూడదు' అని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల కౌంటింగ్‌లో ఈవీఎం ఓట్లతో వీవీప్యాట్ స్లిప్‌లను క్రాస్ వెరిఫై చేయాలని కోరుతూ దాఖలైన సుప్రీంకోర్టు గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణలో పారదర్శకతపై ఆరా తీసింది. పిటిషనర్లలో ఒకరి తరపున న్యాయవాది నిజాం పాషా మాట్లాడుతూ, ఓటరు ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్ స్లిప్ తీసుకొని బ్యాలెట్ బాక్స్‌లో జమ చేయడానికి అనుమతించాలని అన్నారు. మరో పిటిషన్‌పై అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ తరపు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తూ.. కేరళలో జరిగిన మాక్‌పోల్ గురించి కోర్టుకు వివరించారు. కాసర్‌గోడ్‌లో మాక్ ఓటింగ్ జరిగింది. నాలుగు ఈవీఎంలను వీవీప్యాట్‌లతో పోలిస్తే బీజేపీకి అదనంగా ఓట్లు వచ్చాయని వివరించారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణ పారదర్శక ఓటిగి ప్రక్రియ కోసం అనుసరించే విధానాల గురించి ఈసీని కోరగా, ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి వాదనలు కొనసాగుతున్నాయి.Next Story

Most Viewed