ఇండియా-పాక్‌ చర్చలకు మద్దతిస్తాను.. కానీ..

by Dishanational4 |
ఇండియా-పాక్‌ చర్చలకు మద్దతిస్తాను.. కానీ..
X

శ్రీనగర్: ఇండియా, పాకిస్తాన్ మధ్య చర్చలకు మద్దతిస్తానని జమ్మూ-కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. అందుకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత పాక్‌పై ఉందని చెప్పారు. భారత్ వ్యతిరేకిస్తున్న ఉగ్రవాదం, విధ్వంసం వంటి అంశాలపై తర్వాతైనా చర్చించాలని అబ్దుల్లా అన్నారు. ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అబ్దాల్లా మాట్లాడుతూ.. 'చర్చలకు అనుకూల పరిస్థితులను కల్పించడం భారత ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు.. జమ్మూ-కశ్మీర్‌‌తో పాటు భారత్‌లో ఉగ్రవాదుల దాడులు, హింస వంటి వాటి గురించి ఆంధోళనలను పరిష్కరించాల్సిన బాధ్యత పాక్‌పై కూడా ఉంది.

ఇరు దేశాల చర్చలకు నేను ఎల్లప్పుడు మద్దతిస్తాను. కానీ, చర్చలకు అనుకూలమైన వాతావరణం కావాలంటే భారత్ ఆందోళనలను తీసివేయడానికి పాకిస్తాన్ చేయగలిగినదంతా చేయాలి' అని అబ్దుల్లా అన్నారు. భవిష్యత్తులో జమ్మూ-కశ్మీర్‌కు హిందువు ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందా? అన్న ప్రశ్నకు అబ్దుల్లా సమాధానమిస్తూ.. 'ఎవరైనా హిందువు సీఎం అభ్యర్థికి వ్యతిరేకంగా ర్యాలీలో ప్రచారం చేయగలరా? నాకు జ్ఞాపకమున్నంత వరకు ఎవ్వరూ అలాంటి పని చేయరు. చివరికి అత్యంత మెజారిటీ సాధించిన పార్టీ లేదా కూటమి అభ్యర్థినే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. బీజేపీని ఎవరు కాదంటున్నారు?' అని చెప్పారు.


Next Story