పెళ్లి బరాత్‌లో ఎవరూ ఊహించిన ఘటన... ఒక్కసారిగా..

by Disha Web |
పెళ్లి బరాత్‌లో ఎవరూ ఊహించిన ఘటన... ఒక్కసారిగా..
X

దిశ, వెబ్ డెస్క్: హ్యాపీగా పెళ్లి కార్యక్రమం జరిగింది. అనంతరం రాత్రి డీజే పెట్టి బరాత్ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఇరు వర్గాలు రాళ్లతో కొట్టుకున్నాయి. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని రాజఘర్ జిల్లాలోని ఓ గ్రామంలో పెళ్లి వేడుక జరిగింది. అనంతరం పెళ్లి కార్యక్రమం అనంతరం బుధవారం రాత్రి బరాత్ నిర్వహించారు. ఈ బరాత్ లో డీజే విషయమై ఇరు వర్గాల మధ్య గొడవ స్టార్టయ్యింది. అది కాస్త ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితి వరకు వచ్చింది. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లతో కొట్టుకున్నారు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్త్ ప్రారంభించారు.

Next Story