గమ్యం చేరిన శిలలు.. వీటితోనే ఆయోధ్య సీతారాముల విగ్రహాలు

by Dishanational2 |
గమ్యం చేరిన శిలలు.. వీటితోనే ఆయోధ్య సీతారాముల విగ్రహాలు
X

లక్నో: ఆయోధ్య మందిరంలో సీతారాములు విగ్రహాలకు ఉపయోగించేందుకు ట్రక్కులలో నేపాల్ నుంచి బయలుదేరిన సాలగ్రామ శిలలు గురువారం ఆయోధ్య చేరుకున్నాయి. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అప్పగించే ముందు హిందూ దేవుడు రాముడి జన్మస్థలం వద్ద పవిత్ర రాళ్లను పూజారులు, స్థానికులు పూలమాలలతో అలంకరించి పూజలు చేశారు.

వీటితో రాముడి, సీత విగ్రహాలను తయారు చేసి ఆలయ ప్రధాన మందిరంలో ఉంచనున్నారు. మయాగ్డి, ముస్తాంగ్ జిల్లాల గుండా ప్రవహించే కాళీ గండకి నది ఒడ్డున మాత్రమే కనిపించే ప్రత్యేక సాలగ్రామ శిలలను సీత జన్మస్థలమైన నేపాల్‌లోని జనక్‌పూర్ నుండి భారీ ట్రక్కులపై అయోధ్యకు తీసుకొచ్చారు. వీటిని శాస్త్రీయంగా, సాంకేతికంగా పరిశీలించిన తర్వాతే విగ్రహ తయారీకి అనువైనవిగా భావించి నేపాల్ అధికారులు ఆమోదం తెలిపారు. నేపాల్ నుంచి బిహార్ మీదుగా ఆయోధ్య చేరుకున్నాయి. వీటి బరువు వరుసగా 18, 16 టన్నులు ఉంటుందని తెలిపారు.


Next Story

Most Viewed