స్పైజ్‌జెట్ అనూహ్య నిర్ణయం.. ఉద్యోగులకు కీలక ప్రకటన..

by Dishafeatures2 |
స్పైజ్‌జెట్ అనూహ్య నిర్ణయం.. ఉద్యోగులకు కీలక ప్రకటన..
X

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ బడ్జెట్ విమానయాన సంస్థ స్పైజ్ జెట్ తమ ఉద్యోగులను ఇంక్రిమెంట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నెల నుంచి ఉద్యోగులకు 20 శాతం జీతాలు పెంచనున్నట్లు తెలిపింది. అయితే గత నెలలో అయిన 6 శాతం పెరుగదలతో పాటు ఇప్పుడు మరో 20 శాతం పెచనున్నట్లు తెలిపింది. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ స్కీమ్ (ఈసీఎల్‌జీఎస్) పేమెంట్‌ మొదటి విడతను ఎయిర్‌లైన్స్ అందుకుందని, తర్వాతి క్రెడిట్ త్వరలోనే అందనుందని సమాచారం. అక్టోబర్ నెల నుంచి సంస్థలోని కెప్టెన్స్, సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు ఈ ఇంక్రిమెంట్ అందుతుందని సమాచారం.

అయితే కొన్ని రోజుల క్రితం స్పైస్‌జెట్ సంస్థ 80 మంది పైలట్లకు మూడు నెలల సెలవులు ఇచ్చింది. జీతం లేకుండా వారికి మూడు నెలల పాటు సెలవులు ప్రకటించింది. సంస్థ ఖర్చును తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపిందని, కానీ మూడు నెలల తర్వాత మళ్లీ తమకు ఉద్యోగంలోకి తిరిగి తీసుకుంటుందో లేదో కూడా తెలీదని పైలట్లు తెలిపారు.

అయితే ఇప్పుడు సంస్థ ఇంక్రిమెంట్స్ ఇవ్వడం సంచలనంగా మారింది. కానీ 'దాదాపు సెలవులు తీసుకున్న పైలట్ల చాలా వరకు తిరిగి వస్తారన్న ఆశతోనే సంస్థ తన పైలట్ ఇండక్షన్ ప్రోగ్రామ్‌ను కొనసాగించింది. మాగ్జిమం ఫ్లీట్ సుదీర్ఘ గ్రౌండింగ్ కారణంగా సంస్థ అధిక సంఖ్యలో పైలట్‌లు ఉన్నారు' అని సంస్థ తన నోట్‌లో పేర్కొంది.


Next Story

Most Viewed