ఎక్కడైతే టీలు, కాఫీలు అందించాడో.. అక్కడే అసిస్టెంట్ ప్రొఫేసర్‌గా ఉద్యోగంలో చేరాడు

by Dishanational1 |
ఎక్కడైతే టీలు, కాఫీలు అందించాడో.. అక్కడే అసిస్టెంట్ ప్రొఫేసర్‌గా ఉద్యోగంలో చేరాడు
X

దిశ, వెబ్ డెస్క్: చదువుకునే మనసుంటే ఓ కోయిలా మధుమాసమే అవుతుంది ఎళ్లవేళలా అనే పాటను మీరు వినే ఉంటారు. ఇది అక్షరాల ఓ వ్యక్తికి షూట్ అవుతుంది. వాచ్ మెన్ ఉద్యోగం చేసుకుంటూ ప్రతి క్షణాన్ని కూడా ఏ మాత్రం మిస్సవ్వకుండా సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు వెళ్లాడు. వాచ్ మెన్ గా పని చేసిన చోటనే ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ఇప్పుడతని పేరు మారుమోగుతుంది. అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతడి గురించి, అతని సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ స్టోరీ చదవండి.

బీహార్ రాష్ట్రంలోని భగల్ పూర్ ముండీచాక్ ప్రాంతానికి చెందిన కమల్ కిశోర్ మండల్(42) అనే వ్యక్తిది బీద కుటుంబం. రెక్కాడితే గానీ డొక్కాడదు. ఆయన తండ్రి టీ అమ్ముకుంటూ అతడిని డిగ్రీ వరకు చదివించాడు. ఆ తర్వాత పై చదువులు చదివేందుకు పేదరికం అడ్డురావడంతో అతను చదువును అంతటితో ఆపేసి వాచ్ మెన్ గా చేస్తూ ఫ్యామిలీకి చేదోడువాదోడుగా ఉండేవాడు. ఈ క్రమంలో అతడు 2003లో ముంగర్ లో ఉండే ఆర్డీ అండ్ డీజే కాలేజీ నైట్ వాచ్ మెన్ గా చేరాడు. అక్కడి నుంచి కొద్దిరోజులకు భగల్ పూర్ యూనివర్సిటీకి ప్యూన్ గా వెళ్లాడు. అక్కడ పీజీలోని అంబేద్కర్ థాట్ అండ్ సోషల్ వర్క్ డిపార్టుమెంట్ కు ప్యూన్ గా పని చేస్తూ వచ్చాడు. అయితే, అక్కడ స్టాఫ్ కు టీలు, టిఫిన్లు అందించేవాడు. ఈ క్రమంలో అక్కడికి వచ్చే విద్యార్థులను, లెక్చరర్లను గమనించేవాడు. దీంతో అతనికి మళ్లీ చదువుకోవాలన్న ఆశ కలిగింది. అయితే ఇటు ఉద్యోగం వదల్లేని పరిస్థితి. ఈ క్రమంలో తనకు చదువుకోవాలని ఉందని సంబంధిత విభాగానికి ఆయన ఆర్జీ పెట్టుకున్నాడు. వాళ్లు కూడా ఓకే చెప్పారు. వెంటనే అతను.. చదువుకోవడం ప్రారంభించాడు. ఉదయం కాలేజీ.. మధ్యాహ్నం నుంచి బంట్రోతు ఉద్యోగం.. రాత్రిపూట చదువుకోడం... ఇలా ఏళ్లకు ఏళ్లు చదువుకుంటూ పీజీ తోపాటు పీహెచ్ డీని కూడా కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత నెట్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత 2020లో బీహార్ స్టేట్ యూనివర్సిటీ సర్వీస్ కమిషన్ టీఎంబీయూకి సంబంధించిన 4 అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆ ఎగ్జామ్ రాసి ఉద్యోగం సాధించాడు. అది కూడా అతను ఎక్కడైతే టీలు, టిఫిన్లు అందించాడు.. అదే విభాగంలో అసిస్టెంట్ ప్రొఫేసర్ గా విధుల్లో చేరాడు. ఈ విషయం తెలిసి స్థానికులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటు ఉద్యోగం చేస్తూ అటు చదువుకుంటూ అనుకున్నది సాధించాను... నాకు సహకరించిన లెక్చరర్లు, అధికారులు, మిగతా అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.

Next Story

Most Viewed