కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక తర్వాతే విపక్షాలతో సమావేశం

by Disha Web |
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక తర్వాతే విపక్షాలతో సమావేశం
X

న్యూఢిల్లీ: విపక్షాలను ఏకం చేసే దిశగా కీలక అడుగు పడింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం దేశరాజధాని న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి ఎన్నిక ముగిసిన తర్వాత ప్రతిపక్ష పార్టీల సమావేశానికి సోనియా పిలుపునిచ్చినట్లు లాలూ యాదవ్ తెలిపారు. 2024 ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగే సమావేశంలో చర్చిస్తామని సోనియా గాంధీ హామీ ఇచ్చారని చెప్పారు.

'మేము బీజేపీని తొలగించి, దేశాన్ని రక్షించాలి. ఈ కారణంగానే మేమంతా ఏకం కావాలి' అని లాలూ అన్నారు. బీజేపీపై విజయం సాధించాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాల్సిందేనని నితీష్ అన్నారు. 'మేమిద్దరం సోనియా గాంధీతో చర్చించాం. దేశ పురోగతి మార్గంలో కొనసాగాలంటే మేమంతా ఒకే తాటిపైకి రావాలి. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తర్వాత సమావేశం నిర్వహిస్తాం' అని నితీశ్ కుమార్ చెప్పారు. ఒకే ఆలోచన విధానం కలిగిన తామంతా ఎలా ముందుకు పోవాలనే విషయమై చర్చించామని పేర్కొన్నారు.

Next Story

Most Viewed