ఎన్నికల వేళ సెన్సిటివ్ ఇష్యూను టచ్ చేసిన మాజీ CM

by Disha Web Desk 19 |
ఎన్నికల వేళ సెన్సిటివ్ ఇష్యూను టచ్ చేసిన మాజీ CM
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో రాజకీయం రంజుగా మారింది. గెలుపే లక్ష్యంగా ప్రత్యర్థులను ఇరుకున పెట్టే వ్యూహాలకు పార్టీలు ప్రయార్టీ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక మాజీ సీఎం, కాంగ్రెస్ ముఖ్య నేత సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. ఎన్నికలకు ముందే రాజుకున్న ఓ సెన్సిటివ్ ఇష్యుపై ఆయన తాజాగా మరోసారి రియాక్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది.

టిప్పు సుల్తాన్ జయంతి విషయంపై ఆయన స్పందిస్తూ.. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఓ నిర్ణయం తీసుకుంటుందన్నారు. శనివారం ఇండియా టుడే ఛానెల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. తానేమి నియంతను కాదని అందువల్ల ఈ ఎన్నికల్లో తమ ప్రభుత్వమే ఏర్పడితే టిప్పు సుల్తాన్ జయంతిని తిరిగి నిర్వహించాలా లేదా అనే విషయాన్ని కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

అయితే టిప్పు సుల్తాన్ జయంతిని సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2015 నుండి 2019 వరకు నిర్వహించింది. ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆ వేడుకను రద్దు చేసింది. అప్పటి నుంచి ఈ ఇష్యూ కర్ణాటక రాజకీయాల్లో మరింత హాట్ టాపిక్‌గా ఉంటోంది. కాగా బీజేపీ ఇప్పటికే వీడీ సావర్కర్ వర్సెస్ టిప్పు సుల్తాన్‌గా పరిస్థితిని మార్చివేసిన నేపథ్యంలో సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలపై రియాక్షన్ ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠగా మారింది.



Next Story

Most Viewed