కేజ్రీవాల్ అరెస్టయితే ఏం చేయాలి ?

by Disha Web Desk 12 |
కేజ్రీవాల్ అరెస్టయితే ఏం చేయాలి ?
X

న్యూఢిల్లీ : లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఒకవేళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేస్తే ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలా ? వద్దా ? అనే దానిపై ప్రజాభిప్రాయ సేకరణకు ఆప్ కార్యాచరణ ప్రకటించింది. ఇందుకోసం డిసెంబర్ 1 (శుక్రవారం) నుంచి 20వ తేదీ వరకు ‘‘మై భీ కేజ్రీవాల్’’ పేరుతో ప్రోగ్రామ్ నిర్వహిస్తామని ఆప్ సీనియర్ నేత గోపాల్ రాయ్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఆప్ వాలంటీర్లు ఢిల్లీలో పరిధిలోని అన్ని 2,600 పోలింగ్ స్టేషన్లకు వెళ్లి ప్రజలను కలిసి వారికి కరపత్రాలు అందిస్తారని చెప్పారు.

ఈడీ అరెస్టు చేస్తే కేజ్రీవాల్ ఏం చేయాలనే దానిపై ప్రజల అభిప్రాయాలను ఆ కరపత్రాల్లో రాయించి తీసుకుంటామని ఆయన తెలిపారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను గోపాల్ రాయ్ తెలియజేశారు. డిసెంబర్ 21 నుంచి 24 వరకు ఢిల్లీలోని ప్రతి వార్డులో ‘జన్ సంవాద్’ పేరుతో మరో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జన్ సంవాద్‌లో భాగంగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీజేపీ కుట్ర, ఇప్పటివరకు ఆప్ నేతలను అరెస్టు చేసిన తీరు, కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేస్తే తదుపరిగా ఏం చేయాలి అనే దానిపై ప్రజలతో ఆప్ వాలంటీర్లు చర్చిస్తారని వివరించారు.Next Story

Most Viewed