షాకింగ్ వీడియో.. టోల్ ప్లాజా ఉద్యోగిపై మహిళ దౌర్జన్యం.. ఎందుకంటే?

by D.Reddy |   ( Updated:2025-04-17 13:20:24.0  )
షాకింగ్ వీడియో.. టోల్ ప్లాజా ఉద్యోగిపై మహిళ దౌర్జన్యం.. ఎందుకంటే?
X

దిశ, వెబ్ డెస్క్: నేషనల్ హైవేలపై ఉండే టోల్ ప్లాజాల (Toll plaza) వద్ద టోల్ ఫీజు చెల్లించిన తర్వాతే వాహనాలను అనుమతిస్తారని తెలిసిందే. వాహనదారులకు టోల్ చెల్లింపు సులభతరం చేసేందుకు కేంద్ర ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. అయితే, తాజాగా యూపీలో (Uttarpradesh) ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. టోల్ రుసుము చెల్లించమని అడిగినందుకు ఓ మహిళ సిబ్బందిపై దాడికి దిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హావూర్ జిల్లాలోని చిజార్సి టోల్ ప్లాజా వద్దకు ఓ కారు వచ్చి ఆగింది. అయితే, ఆ కారు ఫాస్టాగ్ ఖాతాలో బ్యాలెన్స్‌ లేకపోవటంతో టోల్ ఫీజు చెల్లించాలని టోల్ ప్లాజా సిబ్బంది అడిగారు. దీంతో ఆ వాహనంలోని మహిళ దిగి వచ్చి.. టోల్ ప్లాజా క్యాబిన్‌లోకి వెళ్లి ఉద్యోగిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ హఠాత్ పరిణామనికి ఈ ఉద్యోగి కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇతర సిబ్బంది వచ్చి ఆమెను ఆపే ప్రయత్నించినా.. ఆమె కోపంతో చెలరేగిపోయింది. సదరు మహిళ ఘ‌జియాబాద్ నుంచి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డవ్వగా.. ప్రస్తుతం వైరల్‍గా మారాయి. ఈ దాడికి పాల్పడిన మహిళపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Next Story

Most Viewed