వారే ద్రోహులు.. మాజీ సీఎంపై సీఎం ఘాటు వ్యాఖ్యలు..

by Disha Web |
వారే ద్రోహులు.. మాజీ సీఎంపై సీఎం ఘాటు వ్యాఖ్యలు..
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో సీఎం ఏక్‌నాథ్ షిండే, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేల మధ్య మాటలయుద్ధం పెరుగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ప్రభుత్వం, షిండేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షిండే క్యాంప్‌ను ద్రోహులగా పేర్కొన్నారు. ఠాక్రే వ్యాఖ్యలకు తాజాగా షిండే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హిందుత్వ భావజాలానికి ద్రోహం చేశారని విమర్శించారు. అంతేకాకుండా బాలసాహెబ్ ఆశయాలను తాను నిజమైనా టార్చ్‌బేరర్‌నని షిండే చెప్పుకున్నారు.

'చిరకాల ప్రత్యర్థులు కాంగ్రెస్, ఎన్‌సీపీతో చేతులు కలిపి బాలసామెబ్ ఠాక్రే ప్రతిపాదించిన హిందుత్వ భావజాలాన్ని ఉద్ధవ్ ఠాక్రే మోసం చేశారు. మమ్మల్ని గద్దార్ (దేశ ద్రోహులు)గా పిలుస్తున్నారు. కానీ బాలసాహెబ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న టార్చ్‌బేరర్స్ మేమే. కానీ వారే హిందుత్వ ఆశయాలను, ఆదర్శాలను తగ్గించేశారు. ఎవరు గద్దార్ (దేశ ద్రోహులు), ఎవరు ఖుద్దర్ (ఆత్మ గౌరవం ఉన్న వ్యక్తి) అనేది ప్రజలే తేలుస్తారు' అని షిండే అన్నారు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed