వివాహబంధంలోకి అడుగుపెట్టిన సోనాక్షి.. ఆమె తండ్రి ఏమన్నారంటే?

by Shamantha N |
వివాహబంధంలోకి అడుగుపెట్టిన సోనాక్షి.. ఆమె తండ్రి ఏమన్నారంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఏడేళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉన్న తన ప్రియుడు జహీర్‌ ఇక్బాల్‌ను పెళ్లాడింది. బంధువులు, సన్నిహుతుల సమక్షంలో ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ముంబైలో బాంద్రాలోని సోనాక్షి నివాసంలో వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. కాగా.. కుమార్తె పెళ్లిపై బాలీవుడ్ వెటరన్, అసన్సోల్ ఎంపీ శత్రుఘ్న సింగ్ సంతోషం వ్యక్తం చేశారు. శత్రుఘ్నసింగ్ దంపతులు.. సోనాక్షి, జహీర్ జంటను ఆశీర్వదించారు. ఆ తర్వాత శత్రుఘ్న సింగ్ మీడియాతో మాట్లాడారు. ప్రతితండ్రీ ఈ క్షణం కోసమే ఎదురు చూస్తూంటారని పేర్కొన్నారు. జహీర్ తో సోనాక్షి చాలా సంతోషంగా ఉందన్నారు. వారి జంట ఎప్పటికీ ఇలానే ఉండాలని ప్రార్థించారు. మరోవైపు, పెళ్లి తర్వాత, ఇండస్ట్రీలోని ప్రముఖుల కోసం ముంబైలోని బాస్టియన్ రెస్టారెంట్ లో రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో బాలీవుడ్, దక్షిణాది సినీతారలు సందడి చేశారు.Next Story

Most Viewed