విపక్ష కూటమికి ఆయన నాయకత్వం వహిస్తే ఓకే.. బిహార్ సీఎం సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
విపక్ష కూటమికి ఆయన నాయకత్వం వహిస్తే ఓకే.. బిహార్ సీఎం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: విపక్షాల ఐక్యత కోసం బిహార్ సీఎం నితీష్ కుమార్ చేస్తున్న ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష పార్టీల అధినేతలతో భేటీ అవుతున్న నితీష్ కుమార్.. గురువారం మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే తో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవార్, నితీష్ కుమార్ మధ్య చోటు చేసుకున్న సంభాషణ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించే యోచనలో భాగంగా విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకువస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ కూటమికి మెయిన్ ఫేస్ ఎవరు అనే సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.

ఈ క్రమంలో మహారాష్ట్ర పర్యటనలో ఉన్న నితీష్ కుమార్ ఈ అంశంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. శరద్ పవార్ ప్రతిపక్ష కూటమికి మెయిన్ ఫేస్ కాబోతున్నారా అనే ప్రశ్నకు నితీష్ కుమార్ స్పందిస్తూ.. విపక్షాల కూమిటిలో శరద్ పవార్ నాయకత్వం వహిస్తే అంతకంటే సంతోషకరమైన సంగతి మరొకటి ఉండదని అన్నారు. ఆయన తన పార్టీ కోసం మాత్రమే కాదని దేశం కోసం పని చేయాలని తాను శరద్ పవార్ కు సూచించినట్లు నితీష్ చెప్పారు. అయితే నితీష్ కామెంట్స్ పై వెంటనే స్పందించిన శరద్ పవార్.. ప్రస్తుతాని మేమంతా కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని కూటమికి మెయిన్ ఫేజ్ ఎవరనేది తర్వాత నిర్ణయించబడుతుందని బదులిచ్చారు. కాగా ప్రధాని రేస్ లో తాను లేనని ఇప్పటికే నితీష్ కుమార్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శరద్ పవార్ విషయంలో జరుగుతున్న ప్రచారం ఆసక్తిగా మారింది.

Next Story