స్పీచ్‌ను మధ్యలోనే ఆపిన అమిత్ షా.. దాని కోసమే..

by Disha Web |
స్పీచ్‌ను మధ్యలోనే ఆపిన అమిత్ షా.. దాని కోసమే..
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకాశ్మీర్‌లో అమిత్ షా భారీ ర్యాలీ చేస్తున్నారు. ఈ ర్యాలీ సందర్భంగా బారాముల్లా జిల్లాలో ప్రసంగిస్తున్న అమిత్ షా ఒక్కసారిగా తన స్పీచ్‌ను ఆపేశారు. అదే సమయంలో అజాన్ రావడంతో అమిత్ షా తన ర్యాలీలో ఇస్తున్న స్పీచ్‌ను కొద్ది సేపు ఆపారు. అజాన్ పూర్తైన తర్వాత తిరిగి ప్రసంగించిన షా.. జమ్మూ కాశ్మీర్‌లో పర్యాటకాన్ని పెంచడం ద్వారా యువతకు ఉదయోగావకాశలు కల్పిచడం సాధ్యపడుతుందని తెలిపారు. బరముల్లా ఒకప్పడు టెర్రరిస్ట్ స్పాట్‌గా ఉండేదని కానీ ఇప్పుడు ఇది పర్యాటక ప్రాంతంగా మారిందని షా అన్నారు. ఇక్కడ పర్యాటకంతోనే యువతకు ఉపాధి కల్పిచగలమని ఆయన చెప్పుకొచ్చారు. అనంతరం గత రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన తప్పుబట్టారు. వారి పాలన విధానాల్లో అవకతవకల కారణంగానే జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి నోచుకోలేదని, టెర్రరిస్ట్ రాష్ట్రంగా మారిందని షా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఒక్కసారి ఓటర్ల జాబితాను సిద్ధం చేసే ప్రక్రియ పూర్తైతే రాష్ట్రంలో పూర్తి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించబడతాయని షా చెప్పుకొచ్చారు. భారత దేశ స్వర్గంగా జమ్మూకాశ్మీర్ నిలిచేందుకు ఇక్కడి ఉగ్రవాదాన్ని తాము సమూలంగా నిర్మూలిస్తామని షా ర్యాలీలో అన్నారు.

Next Story

Most Viewed