హర్యానా కథ ముగియలేదు.. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
హర్యానా కథ ముగియలేదు.. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్(Congressల) సీనియర్ నేత జైరాం రమేశ్(Jairam Ramesh) స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హర్యానా ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని అన్నారు. మూడు జిల్లాల్లో ఈవీఎంలతో పాటు అధికారుల తీరుపై కూడా తమకు అనుమానాలు ఉన్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు వ్యతిరేకంగా ఫలితాలు ఉన్నాయని అన్నారు. అసలు ఈ ఫలితాల ప్రక్రియ సరిగా జరిగిందంటే నమ్మడం కష్టంగా ఉందని తెలిపారు. తమ అభ్యంతరాలు అన్నీ ఎన్నికల సంఘం ఎదుట పెడతామని అన్నారు.

ఓడిపోయే అవకాశం లేని స్థానాల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని వెల్లడించారు. హర్యానా కథ ముగియలేదని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు కూడా మీడియాతో మాట్లాడిన జైరాం రమేశ్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లానే హర్యానాలోనూ కౌంటింగ్‌ ట్రెండ్స్‌ను ఈసీ సరిగా అప్‌డేట్ చేయడం లేదని ఆరోపించారు. తప్పుడు ట్రెండ్స్ ఇవ్వాలంటూ అధికార యంత్రాంగంపై బీజేపీ ఒత్తిడి తెస్తోందనే అనుమానం తమకుందంటూ కీలక ఆరోపణలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed