నూతన 'ఏజీ'గా సీనియర్ అడ్వకేట్

by Disha Web Desk 16 |
నూతన ఏజీగా సీనియర్ అడ్వకేట్
X

న్యూఢిల్లీ: నూతన అటార్నీ జనరల్(ఏజీ)గా సీనియర్ అడ్వకేట్ ఆర్. వెంకటరమణి నియామకమయ్యారు. వరుసగా మూడోసారి ఏజీగా ఉన్న కె.కె. వేణుగోపాల్ పదవీకాలం ఈ నెల 30(శుక్రవారం)తో ముగియనుంది. తదుపరి ఏజీగా సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీకి అవకాశం వచ్చినప్పటికీ, ఆయన నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే వేణుగోపాల్ స్థానంలో వెంకటరమణిని నియమిస్తున్నట్టు కేంద్ర న్యాయశాఖ బుధవారం ప్రకటించింది. ఈయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. 1950 ఏప్రిల్ 13న పాండిచ్చెరీలో జన్మించిన వెంకటరమణి.. 1977లో తమిళనాడు బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1979లో సుప్రీంకోర్టు లాయర్‌గా వెళ్లగా, 1997లో అత్యున్నత న్యాయస్థానం ఆయనకు సీనియర్ అడ్వకేట్ హోదా కల్పించింది. 2010, 2013లో లా కమిషన్ ఆఫ్ ఇండియా సభ్యునిగానూ వెంకటరమణి పనిచేశారు. కాగా, భారత ప్రభుత్వపు మొదటి న్యాయ అధికారిగా ఏజీ ఉంటారు. వీరు దేశంలోని అన్ని కోర్టులలోనూ ప్రేక్షకుల హక్కును కలిగి ఉన్నారు.


Next Story

Most Viewed