విద్యార్థుల రాఖీలు కత్తిరించిన స్కూల్.. ఆ తర్వాత..

by Dishafeatures2 |
విద్యార్థుల రాఖీలు కత్తిరించిన స్కూల్.. ఆ తర్వాత..
X

దిశ, వెబ్‌డెస్క్: తోబుట్టువుల మధ్య అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగ రాఖీ. ఈ రోజున అక్కచెల్లెలు తమ సోదరులకు రాఖీలు కడతారు. ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా అదే తరహాలో దేశమంతా రాఖీ పండుగను గొప్పగా జరుపుకున్నారు. కానీ కర్ణాటక మంగళూరులో మాత్రం ఒక స్కూల్ వారు రాఖీల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. విద్యార్థుల చేతులకు ఉన్న రాఖీలను కత్తిరించేశారు. ఈ ఘటన కర్ణాటక మంగళూరులోని ది ఇన్‌ఫాంట్ మెరీ స్కూల్‌లో చోటు చేసుకుంది.

ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర వివాదానికి దారితీస్తోంది. తాజాగా దీనిపై స్కూల్ యాజమాన్యం స్పందించింది. తాము స్టాఫ్ మీటింగ్ నిర్వహించామని, అందులో ఈ చర్యలకు పాల్పడిన ముగ్గురు టీచర్లపై యాక్షన్ తీసుకున్నామని తెలిపారు. దీని గురించి స్కూల్ ఇంచార్జ్ సంతోష్ లోగో క్లారిటీ ఇచ్చారు. తాము ప్రతి మత నమ్మకాలను గౌరవిస్తామని తెలిపారు. 'ప్రతి మత ధర్మాలను, నమ్మకాలను మేము గౌరవిస్తాం. కానీ ఈ ఘటన కొంతమంది స్టాఫ్ సభ్యుల తప్పిదం వల్ల జరిగింది. వారు విద్యార్థుల తల్లిదండ్రులను క్షమాపణ కోరారు. విషయం పరిష్కరించబడింది' అని ఆయన చెప్పుకొచ్చారు.


Next Story