మతంతో సంబంధం లేకుండా అమ్మాయిలందరికీ ఒకే వివాహ వయస్సు!

by Disha Web Desk 17 |
మతంతో సంబంధం లేకుండా అమ్మాయిలందరికీ ఒకే వివాహ వయస్సు!
X

న్యూఢిల్లీ: మతాలు, వ్యక్తిగత చట్టాలకు సంబంధం లేకుండా అమ్మాయిలకు పెళ్లి విషయంలో ఏకరీతి వయస్సును నిర్ధారించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయమై కేంద్రం స్పందించాలని శుక్రవారం కోరింది. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచ్ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

జాతీయ మహిళ కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) మతంతో సంబంధం లేకుండా అమ్మాయిలకు 18 ఏళ్లను పెళ్లి వయసుగా చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరింది. వ్యక్తిగత చట్టాల ప్రకారం ముస్లిం లా తప్ప అన్ని మతాల్లోనూ కనీస వివాహ వయస్సు 18 ఏళ్లుగా ఉంది. అయితే ముస్లిం చట్టంలో మాత్రం అమ్మాయిల కనీస వివాహ వయసు 15 ఏళ్లుగా ఉంది. మెజారిటీని పరిగణనలోకి తీసుకుని 18 ఏళ్ల లోపు వివాహమైతే శిక్ష అర్హులని ఎన్‌సీడబ్ల్యూ పేర్కొంది.

ఐపీసీ చట్టం ప్రకారం కూడా 18 ఏళ్ల లోపు యువతులకు లైంగిక కార్యకలాపాలు చెల్లుబాటు కావు. బాల్య వివాహాల నియంత్రణ చట్టం 2006 ప్రకారం కనిష్ట వివాహ వయస్సు అబ్బాయిలకు 21, అమ్మాయిలకు 18 ఏళ్లుగా ఉంది.


Next Story

Most Viewed