ఇస్లాం అంతర్గత వ్యవహరాల్లో జోక్యం అనవసరం

by Dishanational2 |
ఇస్లాం అంతర్గత వ్యవహరాల్లో జోక్యం అనవసరం
X

న్యూఢిల్లీ: హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు విభిన్న తీర్పులను ప్రకటించడంపై ముస్లిం క్లరిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇస్లాం అంతర్గత వ్యవహారాల్లో ఏ ఒక్కరూ కూడా జోక్యం చేసుకోవద్దని మౌలనా మీర్జా షఫిక్ హుస్సేన్ అన్నారు. కోర్టులు ఈ విషయాల్లో తలదూర్చకూడదని పేర్కొన్నారు. తాము రోజుకు నాలుగు సార్లు నమాజ్ చేస్తే, ఎన్ని సార్లు చేయాలో కూడా చెబుతారా అని ప్రశ్నించారు.

పాఠశాలల్లో యూనిఫాం మాత్రమే ధరించాలి: బీజేపీ

పాఠశాలల్లో యూనిఫాంలు కాకుండా హిజాబ్, ఇతర ఏ వస్త్రాధారణను వ్యతిరేకిస్తామని బీజేపీ జాతీయ సెక్రటరీ సీటీ రవి అన్నారు. మత స్వేచ్ఛ అనేది వేర్పాటువాదాన్ని ప్రోత్సహించకూడదని పేర్కొన్నారు. ఇదే భారత్‌ను విభజించేందుకు కారణమవుతుందని చెప్పారు. కర్ణాటక సీనియర్ నేతగా తాను కోర్టు తీర్పుపై స్పందించబోనని చెప్పారు. కర్ణాటకలో యూనిఫాం ధరించడం 1965 నుంచి తప్పనిసరిగా ఉందని గుర్తు చేశారు. సమస్య హిజాబ్‌లు ధరిండంపై కాదని, పాఠశాలల్లో ఏమి ధరించడం అనే విషయమై అని తెలిపారు.

Next Story

Most Viewed