తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్.. RSS కవాతుకు అనుమతి

by Disha Web Desk 12 |
తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్.. RSS కవాతుకు అనుమతి
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీకోర్టు షాక్ ఇచ్చింది. తమిళనాడు‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కి మార్చ్‌లు నిర్వహించేందుకు అనుమతిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను మంగళవారం కోర్టు తోసిపుచ్చింది. తోసిపుచ్చింది. తిరిగి షెడ్యూల్ చేసిన తేదీల్లో ఊరేగింపును అనుమతిస్తూ, ప్రజాస్వామ్యానికి నిరసనలు అవసరమని హైకోర్టు పేర్కొంది. అయితే కోర్టులో ప్రభుత్వం.. RSS మార్చ్ శాంతిభద్రతల సమస్య కలిగిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.



Next Story

Most Viewed