పరీక్ష పవిత్రత దెబ్బతింటుంది.. నీట్ పరీక్ష రద్దుపై సుప్రీం వ్యాఖ్యలు

by Shamantha N |
పరీక్ష పవిత్రత దెబ్బతింటుంది.. నీట్ పరీక్ష రద్దుపై సుప్రీం వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ - 2024 పరీక్ష రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం అంత సులువు కాదని కోర్టు తెలిపింది. అలా చేస్తే పరీక్షకు ఉన్న పవిత్రత దెబ్బతింటుందని పేర్కొంది. నీట్ పరీక్షలో అవతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే నీట్‌ ప్రవేశ పరీక్షను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై జస్టిన్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ అమనుల్లాతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరిపింది. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని చేస్తున్నఆరోపణలపై సమాధానాలు కావాలని కోర్టు పేర్కొంది. దీనిపై జులై 8లోగా స్పందన తెలియజేయాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది. ఇక, ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల కౌన్సిలింగ్‌ ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసులో తదుపరి విచారణను జులై 8వ తేదీకి వాయిదా వేసింది.

నీట్ పరీక్షలో అకతవకలు

ఈ ఏడాది మే 5వ తేదీన నీట్ యూజీ -2024 ప్రవేశ పరీక్ష జరిగింది. జూన్‌ 4న ఫలితాలను ప్రకటించారు. అయితే తొలుత జూన్‌ 14న ఫలితాలను వెల్లడిస్తామని తెలిపారు. కానీ, ఓట్ల లెక్కింపు జరుగుతుండగానే నీట్ ఫలితాలు విడుదల చేయడంతో వివాదాలు చెలరేగింది. ఈ ఫలితాల్లో 67 మంది విద్యార్థులకు ఆలిండియా తొలి ర్యాంకు రాగా.. ఒకే ఎగ్జామ్ సెంటర్ కు చెందిన ఆరుగురికి ఫుల్ మార్క్స్ వచ్చాయి. దీంతో, పేపర్‌ లీకేజీ జరిగిందని, ఫలితాల్లోనూ అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడ్డాయి. ఈ ఆరోపణలపై విచారణకు యూపీఎస్సీ మాజీ ఛైర్మన్‌ ఆధ్వర్యంలో నలుగురు సభ్యులతో కమిటీ వేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలోనే దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.



Next Story

Most Viewed