- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
గాజాలో దాడులు ఆందోళనకరం.. మానవతా సంక్షోభం అన్న జైశంకర్
దిశ, నేషనల్ బ్యూరో: గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆందోళనకరం అని అన్నారు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 55వ సెషన్ లో వర్చువల్ గా జైశంకర్ ప్రసంగించారు. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం వల్ల మానవతా సంక్షోభ పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. దీని పరిష్కారం కోసం ఇరు దేశాలు దృష్టి సారించాలన్నారు.
ఇజ్రాయెల్‌లో హమాస్ ఉగ్రదాడిని భారత్ ఖండిస్తుందని నొక్కి చెప్పారు. ఉగ్రవాదం, అమాయకులను బందీలుగా చేసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని.. భారత్ ఎప్పటికీ అలాంటి వాటికి మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. ఇలాంటి వివాదాలు ఇతర దేశాలకు వ్యాపించకూడదని ఆశిద్దాం అని అన్నారు.
అంతర్జాతీయ మానవతా చట్టాలను గౌరవించాలని సభ్యదేశాలను కోరారు జైశంకర్. మానవ హక్కుల హామీలకు భారత్ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో భారత్ సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. 2023లో టర్కీ, సిరియాలో విపత్తు సంభవించినప్పుడు వాటికి సాయం చేయడంలో భారత్ కృషి చేసిందన్నారు. శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదురైనప్పుడు భారత్ సాయం చేసిందని గుర్తుచేశారు.
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి అధ్యక్షుడిగా ఒమర్ నిబర్ ఎన్నికయ్యారు. ఒమర్ నిబర్ కు అభినందనలు తెలిపారు జైశంకర్. కౌన్సిల్ అన్ని డిపార్ట్ మెంట్లకు భారత్ పూర్తి మద్దతు, సహాయసహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. మానవ హక్కుల రక్షణ కోసం కౌన్సిల్ సభ్యులు, పరిశీలకులతో కలిసి పనిచేసందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు జైశంకర్.