ట్రంప్ పర్యటనకు కేంద్రం ఖర్చు రూ.38 లక్షలు

by Dishanational4 |
ట్రంప్ పర్యటనకు కేంద్రం ఖర్చు రూ.38 లక్షలు
X

న్యూఢిల్లీ: 2020లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనలో రూ.38 లక్షలు వెచ్చించినట్లు కేంద్రం వెల్లడించింది. మిషాల్ భతేనా అనే వ్యక్తి ట్రంప్ భారత పర్యటనలో కేంద్ర ప్రభుత్వం చేసిన ఖర్చులపై విదేశాంగ వ్యవహారాల శాఖ సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ ద్వారా కోరారు. దీనిపై కేంద్ర సమాచార కమిషన్ వివరాలు వెల్లడించింది. ఈ సందర్భంగా ఆయన వసతికి, ఆహారం, ఇతర ఖర్చులకు ఈ డబ్బులు ఖర్చు చేసినట్లు పేర్కొంది. 2020 ఫిబ్రవరి 24-25 తేదీల్లో తొలిసారిగా ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా, కూతురు ఇవాంకా, అల్లుడు జరేడ్ కుష్నర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు భారత్‌లో పర్యటించారు.

ఈ సందర్భంగా ట్రంప్ అహ్మదాబాద్‌లో 22కిలోమీటర్ల రోడ్డు షో‌లో పాల్గొన్నారు. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులు ఆర్పించారు. ఆ తర్వాత ఆగ్రాలోని తాజ్ మహాల్‌ను సందర్శించారు. ఆ తర్వాత రోజు ఢిల్లీలో ప్రధాని మోడీతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. కాగా మిషాల్ తన అప్పీలుకు ముందుగా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ తర్వాత కమిషన్‌ను ఆశ్రయించాడు. ఈ మధ్యనే మంత్రిత్వ శాఖను తెలిపిన ఖర్చుల నివేదికను కమిషన్ వెల్లడించింది. సమాధానాన్ని సంతృప్తికరంగా అందించడం కోసమే జాప్యానికి గల కారణామని మంత్రిత్వ శాఖ వివరించిందని సమాచార కమిషనర్ చీఫ్ వైకే సిన్హా చెప్పారు.


Next Story

Most Viewed