ఆర్ఎస్ఎస్ మీటింగ్‌కు మహిళా చీఫ్ గెస్ట్.. చరిత్రలో తొలిసారి..

by Disha Web |
ఆర్ఎస్ఎస్ మీటింగ్‌కు మహిళా చీఫ్ గెస్ట్.. చరిత్రలో తొలిసారి..
X

దిశ, వెబ్‌డెస్క్: దసరా సందర్భంగా ఆర్ఎస్ఎస్ నిర్వహించిన సమావేశానికి సంతోష్ యాదవ్‌ను ముఖ్యఅతిథిగా పిలవడం జరిగింది. ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారుతోంది. నాగ్‌పూర్‌లోని ఆర్ఎస్ఎస్ హెడ్‌క్వా్ర్టర్స్‌లో ఆర్ఎస్ఎస్ విజయదశమి 2022 వేడుకలను నిర్వహించింది. అయితే ఆర్ఎస్ఎస్ చరిత్రలో మొట్టమొదటి సారి సంఘ్ నిర్వహించిన కార్యక్రమానికి ఓ మహిళ ముఖ్య అతిథిగా విచ్చేశారు. దసరా సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి సంతోష్ యాదవ్ రాకతో సరికొత్త చరిత్ర సృష్టించబడిందని, ఆమె తన జీవితంలో ఏ మహిళా చేయని రెండు పనులను ఆమే తొలిసారి చేశారు. మొదటిది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు సార్తి అధిరోహించిన తొలి మహిళ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తొలి మహిళగా ఆమె అరుదైన గౌరవం అందుకున్నారు.

Next Story

Most Viewed