నోట్లను రద్దు చేసే అధికారం ఆర్బీఐకు లేదు.. హైకోర్టులో పిల్

by Vinod kumar |
నోట్లను రద్దు చేసే అధికారం ఆర్బీఐకు లేదు.. హైకోర్టులో పిల్
X

న్యూఢిల్లీ: కరెన్సీ నోట్ల చెలామణిని రద్దు చేసే, నోట్లను ఉపసంహరించుకునే అధికారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)కు లేదని, అలాంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందంటూ ఢిల్లీ హైకోర్టులో మంగళవారం పిల్ దాఖలైంది. రూ.2 వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని పిటిషనర్ రజనీశ్ భాస్కర్ గుప్తా హైకోర్టులో సవాల్ చేశారు. రూ.2 వేల నోట్ల జీవిత కాలం 4-5 సంవత్సరాలు మాత్రమే అనే నిర్ధారణకు ఆర్బీఐ ఎలా వచ్చిందో చెప్పాలని గుప్తా తరఫు న్యాయవాది ప్రశ్నించారు.

నోట్లను జారీ చేసే కాలాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. అయితే.. ఆర్బీఐ విడుదల చేసిన ఇదే సర్క్యులర్ పై హైకోర్టు ఇప్పటికే ఒక పిల్ ను కొట్టివేసిందని, సుప్రీం కోర్టు ఆదేశం ప్రకారం ఇదే అంశంపై మరో పిల్ ను అనుమతించరాదని ఆర్బీఐ తరఫు న్యాయవాది పరాగ్ పి.త్రిపాఠి వాదించారు. ఈ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ లతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.

Next Story

Most Viewed