జార్ఖండ్‌లో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

by Dishanational2 |
జార్ఖండ్‌లో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్‌లోని జంషెడ్ పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా..మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిత్యపూర్‌కు చెందిన 8మంది ఓ కారులో వెళ్తుండగా జంషెడ్ పూర్ వద్ద అదపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో 5గురు అక్కడి కక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో మరణించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు.

Next Story

Most Viewed