ఎన్డీయోలో చేరిన ఆర్‌ఎల్‌డీ.. సీట్ షేరింగ్ పై క్లారిటీ

by Disha Web Desk 12 |
ఎన్డీయోలో చేరిన ఆర్‌ఎల్‌డీ.. సీట్ షేరింగ్ పై క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)లో అధికారికంగా చేరుతున్నట్లు రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్‌ఎల్‌డి) చీఫ్ జయంత్ సింగ్ శనివారం ప్రకటించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం పేదల సంక్షేమం, సమాంతర అభివృద్ధిని చేస్తోంది. ఈ క్రమంలోనే నేను అమిత్ షా, జేపీ నడ్డాను కలిశాను. ప్రజల కోసం నేను ఎన్‌డిఎలో చేరాలని నిర్ణయించుకున్నానని ఎన్డీయేలో చేరిన తర్వాత తన ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో యూపీలో సీట్ల షేరింగ్ పై కూడా ఇరుపార్టీల మధ్య క్లారిటీ వచ్చింది. ఆర్ఎల్డీ కోరుతున్న 2 స్థానాలను వారికే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో 80 పార్లమెంట్ స్థానాలు ఉన్న యూపీలో 78 బీజేపీ, 2 ఆర్ఎల్డీ పంచుకున్నాయి. ఇందులో బీజేపీ ఇప్పటికే 51 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.


Next Story

Most Viewed