సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం: ఎలక్టోరల్ బాండ్ల వివాదంపై అమిత్ షా

by Dishanational2 |
సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం: ఎలక్టోరల్ బాండ్ల వివాదంపై అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. బుధవారం ఆయన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్లు అతిపెద్ద దోపిడీ రాకెట్ అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. రాహుల్ కి కూడా బాండ్ల ద్వారా రూ.1600కోట్లు అం దాయని అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఆయనే సమాధానం చెప్పాలన్నారు. ‘సుప్రీంకోర్టు నిర్ణయం పౌరులందరికీ కట్టుబడి ఉంటుంది. ఎలక్టోరల్ బాండ్లపై తీర్పును గౌరవిస్తున్నాను. అయితే రాజకీయాల్లో నల్లధనాన్ని బాండ్లు పూర్తిగా అంతం చేశాయి. అందుకే రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండియా కూటమి బాండ్లకు వ్యతిరేకంగా ఉంది. వారు రాజకీయాలను మరోసారి శాసించాలని కోరుకుంటున్నారు’ అని తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో రాజకీయాల్లో మరోసారి బ్లాక్ మనీ రాజ్యమేలే చాన్స్ ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పారదర్శకతతో కూడిన వ్యవస్థను బీజేపీ విశ్వసిస్తుందని చెప్పారు. కాగా, ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌ను సుప్రీంకోర్టు ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed