కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు

by Disha Web Desk |
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు 8వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉంటే అక్టోబర్ 17న ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 19న ఓట్ల లెక్కించి ఫలితాన్ని వెల్లడిస్తారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో 9 వేల మంది పీసీసీ డెలిగేట్స్ ఓటు హక్కు వినియోగించుకొనున్నారు. అయితే పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే ఉండాలనే ప్రతిపాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో తెలంగాణతో సహా పలు రాష్ట్రాల పీసీసీలు తీర్మానాలు చేశారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం సుముఖత చూపడం లేదు. దీంతో ఎన్నిక అనివార్యం అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి పోటీ రేసులో రాజస్థాన్ సీఎం అశోక్‌ గహ్లోట్, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అధ్యక్ష ఎన్నిక పోటీలో మరో కీలక నేత పేరు కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గురువారం ఢిల్లీకి చేరుకోనున్నారు. ఆయన పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది. ఆయన పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.



Next Story

Most Viewed