చార్ ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు

by Shamantha N |
చార్ ధామ్ యాత్రకు పోటెత్తిన భక్తులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఛార్ ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. రికార్డు స్థాయిలో భక్తులు బద్రినాథ్ ఆలయాన్ని సందర్శించినట్లు అధికారులు తెలిపారు. నెలరోజుల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 5 లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు వెల్లడించారు. గతేడాది తొలి నెల రోజుల్లో 4.5 లక్షల మంది బద్రీనాథ్‌ ఆలయాన్ని సందర్శించినట్లు వెల్లడించారు. గతంతో పోలిస్తే 50 వేల మంది భక్తులు అదనంగా దర్శించుకున్నట్లు తెలిపారు.

19 లక్షల మంది సందర్శన

ఛార్ ధామ్ యాత్రకు ఇప్పటివరకు 19 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ వివరాలను బద్రినాథ్‌-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ సభ్యుడు వెల్లడించారు. ఆలయం తెరిచిన నెలలోపే బద్రినాథ్‌ ఆలయాన్ని 5 లక్షల మంది దర్శించుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది భక్తులు వస్తారని భావిస్తున్నామని తెలిపారు. మే 12న బద్రీనాథ్ ఆలయాన్ని తెరిచారు. కేదార్ నాథ్, యమునోత్రి, గంగోత్రి ఆలయాలకు వేలసంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు.

Next Story

Most Viewed