2 వేల నోట్ల డిపాజిట్లపై ఆర్బీఐ కొత్త నిబంధన.. రూ. 50 వేలు మించితే..

by Disha Web Desk 12 |
2 వేల నోట్ల డిపాజిట్లపై ఆర్బీఐ కొత్త నిబంధన.. రూ. 50 వేలు మించితే..
X

దిశ, డైనమిక్ బ్యూరో: రూ. 2 వేల నోట్ల డిపాజిట్‌పై ఆర్బీఐ తాజాగా ఓ నిబంధనను తీసుకొచ్చింది. 2 వేల నోట్ల డిపాజిట్ లో భాగంగా నగదు రూ. 50 వేలకు మించితే కచ్చితంగా పాన్ కార్డు ఉండాల్సిందేనని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నగదు నిర్వహణలో భాగంగానే పెద్ద నోటును ఉపసంహరించుకున్నట్టు చెప్పారు. 2016లో నోట్ల రద్దు అనంతరం.. భారీగా నగదు లభ్యత ఉంచేందుకే రూ. 2000 నోటును అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు.

సెప్టెంబర్ 30 నాటికి చాలా వరకు రూ.2,000 నోట్లు ఖజానాకు చేరతాయని తాము అంచనా చేస్తున్నామన్నారు. నోట్ల డిపాజిట్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేశామని చెప్పుకొచ్చారు. ప్రజలు బ్యాంకుల వద్ద బారులు తీరొద్దనే ఉద్దేశ్యంతోనే చాలా సమయం ఇచ్చినట్టు క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ పెద్ద మొత్తంలో 2000 నోట్లు డిపాజిట్ అయితే అందుకు సంబంధించిన వ్యవహారాలను ఆదాయపు పన్ను శాఖ తీసుకుంటుందని చెప్పారు.

Read More: రూ.వెయ్యి నోటు ముద్రణ.. ఆర్బీఐ గవర్నర్ క్లారిటీ!



Next Story

Most Viewed