580కిలోల గంజాయిని ఎలుకలు తిన్నాయి

by Disha Web |
580కిలోల గంజాయిని ఎలుకలు తిన్నాయి
X

లక్నో: ఓ కేసు విచారణలో భాగంగా పట్టుబడిన గంజాయిని అప్పగించాలన్న యూపీలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలకు మధుర పోలీసులు ఆశ్చర్యకర సమాధానం ఇచ్చారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న 581 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని పేర్కొంటూ, స్పెషల్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ (1985) కోర్టుకు నివేదిక సమర్పించారు. తమకు పట్టుబడిన మత్తు పదార్థాలను మధుర పట్టణంలోని షేర్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో 386కిలోలు నిల్వ చేయగా, హైవే పోలీస్ స్టేషన్‌లో 195 కిలోలు నిల్వ చేశామని, అయితే ఈ మొత్తం గంజాయినీ ఎలుకలు తిన్నాయని పేర్కొన్నారు. వీరి నివేదికపై స్పందించిన ప్రత్యేక కోర్టు.. శనివారంలోగా అందుకు తగిన ఆధారాలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కాగా, ఎలుకలు తిన్నాయని చెబుతున్న గంజాయి విలువ సుమారు రూ.60లక్షలు కావడం గమనార్హం.

Next Story

Most Viewed