ప్రపంచ భౌగోళిక-రాజకీయ పరిస్థితుల మధ్య కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్!

by Disha Web Desk |
ప్రపంచ భౌగోళిక-రాజకీయ పరిస్థితుల మధ్య కొత్త సవాళ్లకు సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్ సింగ్!
X

న్యూఢిల్లీ: వేగంగా మారుతున్న ప్రపంచ భౌగోళిక-రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, వాటిని భారత్‌కు అన్వయిస్తూ సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత వైమానిక దళంలోని టాప్ కమాండర్లను కోరారు. రెండు రోజుల ఐఏఎఫ్ కమాండర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా గురువారం ప్రారంభ సెషన్‌లో ప్రసంగించిన రాజ్‌నాథ్ సింగ్, భారత వైమానిక రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం, డ్రోన్‌ల వినియోగంపై దృష్టి సారించాలని ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులకు సూచించారు. 'గ్లోబల్ సెక్యూరిటీ దృష్ట్యా కొత్త సవాళ్లు ఉత్పన్నమవుతున్నాయి. వాటిని ఎదుర్కొనేందుకు ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉండాలని' రాజ్‌నాథ్ సింగ్ కమాండర్లతో అన్నారు.

వైమానిక యుద్ధం రంగంలో కొత్త పోకడలు ఉద్భవించాయని, రక్షణ రంగాన్ని పటిష్టం చేసేందుకు వాటి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే సమయంలో హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఇతర వరద ప్రభావితం ప్రాంతాల్లో ఇటీవల ఐఏఎఫ్ చేపట్టిన మానవతా సాయం, విపత్తు సహాయ మిషన్‌ల 'అద్భుత పాత్ర'ను రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో విమానిక దశ దినోత్సవ పరేడ్, వైమానిక ప్రదర్శనను విజయవంతంగా నిర్వహించినందుకు ఐఏఎఫ్‌ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ తదితరులు పాల్గొన్నారు.



Next Story