తల్లులకు రైల్వే గుడ్ న్యూస్

by M.Rajitha |
తల్లులకు రైల్వే గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్ : చంటి పిల్లల తల్లుల ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు రైల్వే శాఖ బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు. లఖనపూ మెయిల్ సర్వీసులో ప్రయోగాత్మకంగా రెండు బెర్తులను అమర్చినట్టు తెలిపారు. దీనిపై ప్రయాణికుల్లో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పిన మంత్రి... ఈ బెర్తుల వల్ల సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవడం, సీట్ల మధ్య దూరం తగ్గడం వంటి సమస్యలు గుర్తించామని అన్నారు. వీటికి కూడా త్వరలోనే పరిష్కారం చూపుతూ అన్ని సర్వీసుల్లో బేబీ బెర్తుల సదుపాయం అందుబాటులోకి తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. కాగా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే చిన్న పిల్లల తల్లులు రైళ్లలో ఎక్కువ దూరం ప్రయాణించడం చాలా సౌకర్యవంతంగా మారనుంది.



Next Story

Most Viewed