ప్రధాని మోడీ తీరు భారత రాష్ట్రపతిని అవమానించడమే: రాహుల్ గాంధీ ఫైర్

by Disha Web Desk 19 |
ప్రధాని మోడీ తీరు భారత రాష్ట్రపతిని అవమానించడమే: రాహుల్ గాంధీ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని మోడీ ప్రారంభించనుండటంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ నూతన భవనాన్ని స్పీకర్ ప్రారంభించాలని.. కానీ రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తూ ప్రధాని మోడీ నూతన పార్లమెంట్‌ను ఓపెనింగ్ చేయడమేంటి అంటూ బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై ప్రతిపక్షాలు, అధికార బీజేపీకి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రస్తుతం నూతన పార్లమెంట్ భవన ఓపెనింగ్ దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రధాని మోడీ పార్లమెంట్‌ను ప్రారంభించనుండటంతో ఇప్పటికే 19 విపక్ష పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరుకామని ఉమ్మడి ప్రకటన చేశాయి. ఈ క్రమంలో ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ రియాక్ట్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ బీజేపీపై ఫైర్ అయ్యారు. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి భారత దేశ ప్రథమ పౌరురాలైన రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అవమానించడమేనని రాహుల్ అన్నారు. భారత నూతన పార్లమెంట్ భవనం అహం అనే ఇటుకలతో తయారు కాలేదని.. అత్యున్నతమైన భారత రాజ్యాంగ విలువలతో నిర్మితమైనదని పేర్కొన్నారు. ప్రధాని మోడీ తీరు భారత రాష్ట్రపతిని అవమానించడమేనన్నారు.

Also Read..

కేజ్రీవాల్‌కు కవిత నుంచి భారీ ఫండ్స్.. సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు

Next Story