కశ్మీరీ పండిట్ల రక్షణ పై ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ

by Disha Web Desk 17 |
కశ్మీరీ పండిట్ల రక్షణ పై ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ
X

న్యూఢిల్లీ: కశ్మీరీ పండిట్లను చంపడమే లక్ష్యంగా కశ్మీర్ లోయలో తీవ్రవాదులు పనిచేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. కశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించాలని ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో భారత్ జోడో యాత్ర కొనసాగించినప్పుడు పండిట్లను కలిశానని రాహుల్ తెలిపారు. ఉగ్రదాడుల వల్ల కశ్మీర్ లోయ నుండి పారిపోయిన వారిని అధికారులు తిరిగి తీసుకొచ్చి పండిట్ ఉద్యోగాలను చేయాల్సిందిగా బలవంతం చేస్తున్నట్టు ఆ వర్గం వారు తనకు ఫిర్యాదు చేశారని రాహుల్ తెలిపారు.

'కశ్మీర్ లోయకు వెళ్లి ఉద్యోగాలు చేయాలని అధికారులు బలవంతం చేస్తున్నట్టు వాళ్లు (కశ్మీరీ పండిట్ బృందం) నాతో చెప్పారు. భద్రత లేని సమయంలో వాళ్ల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తూ వారిని లోయకు వెళ్లమనడం దారుణం. పరిస్థితులు మెరుగయ్యే వరకు కశ్మీరీ పండిట్స్ సేవలను పరిపాలనా లేదా ప్రజా సౌకర్యాల విభాగాల్లో ఉపయోగించుకోవాలి. వారి బాధలను, డిమాండ్స్‌ను మీ దృష్టికి తీసుకెళతానని కశ్మీరీ పండిట్ బ్రదర్స్, సిస్టర్స్‌కు మాట ఇచ్చాను' అని ప్రధాని మోడీకి హిందీలో రాసిన లేఖలో రాహుల్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed