- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
వివరణ ఇచ్చుకుంటా.. అవకాశం ఇవ్వండి

న్యూఢిల్లీ: బీజేపీపై తనపై చేస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చుకుంటానని, ఇందుకు తనకు పార్లమెంటులో మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. ‘పార్లమెంటు లోపల, వెలుపలా అధికార పార్టీ నేతలు నాపై అవమానకర, పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేశారు. వారి ఆరోపణలకు వివరణ ఇచ్చుకుంటాను. కాబట్టి, లోక్‌సభలో విధివిధానాలు, ప్రవర్తనా నియమాలలోని వ్యక్తిగత వివరణలను అనుమతించే రూల్ 357 ప్రకారం, నాకు సభలో మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని మరోసారి కోరుతున్నాను’ అంటూ లేఖలో పేర్కొన్నారు. కాగా, లండన్ పర్యటనలో భాగంగా ఓ కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ, భారత్‌లో ప్రజాస్వామ్యం దాడికి గురవుతుందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నేతలు.. రాహుల్ క్షమాపణ చెప్పాలంటూ ఉభయ సభల్లో డిమాండ్ చేస్తున్నారు.