- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- వైరల్
- పర్యాటకం
- టెక్నాలజీ
- Telugu News
- IPL2023
సస్పెన్షన్ ఎఫెక్ట్.. ట్విట్టర్ అకౌంట్‌లో కీలక మార్పులు చేసిన రాహుల్ గాంధీ

దిశ, డైనమిక్ బ్యూరో: రాహుల్‌గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు కావడంతో ఆయన తన ట్విట్టర్ అకౌంట్‌లో మార్పులు చేశారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అని ఉన్న తన వ్యక్తిగత వివరాల స్థానంలో ‘డిస్’క్వాలిఫైడ్ ఎంపీ అంటూ అప్‌డేట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సభ్యుడినే అంటూ స్పష్టత ఇచ్చారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా 2019లో కర్నాటకలో చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది.
ఆయనను దోషిగా పేర్కొంటూ రెండేళ్ళ జైలుశిక్ష విధించింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న లోక్‌సభ సెక్రటేరియట్ ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దుచేసింది. మూడు రోజులుగా ఈ వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ పరిస్థితుల్లో ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వ్యక్తిగత వివరాలను అప్‌డేట్ చేసి అందులో ‘డిస్’క్వాలిఫైడ్ ఎంపీ అని పేర్కొనడం గమనార్హం.