'ఇలా జరుగుతుందని ఊహించలేదు': రాహుల్ గాంధీ

by Disha Web Desk 12 |
ఇలా జరుగుతుందని ఊహించలేదు: రాహుల్ గాంధీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: తనపై విధించిన అనర్హత వేటుపై రాహుల్ గాంధీ మరోసారి రియాక్ట్ అయ్యారు. పరువు నష్టం కేసులో గరిష్టంగా శిక్ష పడిన వారిలో బహుశా నేనే మొదటి వ్యక్తిని అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలో భారతీయ మూలాలు కలిగిన వారితో మాట్లాడిన ఆయన బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీపై తాము ప్రజాస్వామ్యబద్దంగా పోరాడుతున్నామని లోక్‌సభ అనర్హుడిని అవుతానని ఎన్నడు ఊహించలేదన్నారు.

రెండు దశాబ్దాల క్రితం తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతాయని అనుకోలేదన్నారు. అనర్హత వేటు నాకు చాలా పెద్ద అవకాశం ఇచ్చిందని నేను భావిస్తున్నట్లు చెప్పారు. స్వదేశంలో పరిస్థితులను చక్కదిద్దడానికి విదేశీ సహాయం కోరుతున్నారా అని అడిగినప్పుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ ఎవరి సహకారం కోరడం లేదని అన్నారు. మా పోరాటం మాదే అనే స్పష్టత మాకు ఉందని చెప్పారు.

Also Read..

ఆయుధాలు కలిగి ఉన్నవారు లొంగిపోవాలి: అమిత్ షా

Next Story

Most Viewed