అదో చారిత్రాత్మక పదవి.. కాంగ్రెస్ అధ్యక్ష పదవి అభ్యర్థులకు రాహుల్ గాంధీ సలహా..

by Dishafeatures2 |
Rahul Gandhi does not seem to be taking charge as Congress Chief
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతోంది. ఇన్నాళ్లూ ఖాళీగా ఉన్న అభ్యర్థుల జాబితా చిన్నిచిన్నగా నిండుతోంది. శశి థరూర్ తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినప్పటి నుంచి అభ్యర్థుల సంఖ్య పెరుగుదల ఊపందుకుంది. ఈ పోటీలో గెహ్లోట్, సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా చేరుతున్నట్లు అర్థమవుతోంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి అభ్యర్థులకు తనదైన సలహా ఇచ్చారు. అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న అభ్యర్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ గురువారం మాట్లాడారు.

ఇది కేవలం ఓ పోస్ట్ కాదని, కానీ విశ్వాస వ్యవస్థను సూచించే సైద్దాంతిక పోస్ట్ అని రాహుల్ చెప్పుకొచ్చారు. 'కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ చేసే వారికి నా సలహా ఒక్కటే. మీరు ఓ చరిత్రాత్మక పోస్ట్‌ను తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పదవి భారతదేశ ప్రత్యేక దృక్పథాన్ని నిర్వచిస్తుంది. ఇది ఒక వ్యవస్థలోని పోస్ట్ కాదు. ఇది విశ్వాస వ్యవస్థను సూచించే సైద్దాంతిక పోస్ట్' అని రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో తెలిపారు.


Next Story

Most Viewed