పార్లమెంట్‌లో మొదటిసారి అడుగుపెట్టినప్పుడు అదే చేశా: ప్రధాని

by Disha Web Desk 2 |
పార్లమెంట్‌లో మొదటిసారి అడుగుపెట్టినప్పుడు అదే చేశా: ప్రధాని
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి నుంచి 5 రోజుల (సెప్టెంబర్ 22) పాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. పాత పార్లమెంట్ భవనం విశిష్టతను మోడీ వివరించారు. నెహ్రూ, అంబేద్కర్ లాంటి మహానుభావులు నడిచిన భవనం ఇది అని తెలిపారు. మొదటిసారి ఈ భవనంలో అడుగుపెట్టినప్పుడు భవనంలోని ప్రతీ గడపకూ నమస్కరించారని గుర్తుచేసుకున్నారు. పార్లమెంట్‌లోకి వస్తే గుడిలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుందని చెప్పారు.

ఎంపీలు మాత్రమే కాదు.. భవనం సిబ్బంది పాత్ర కూడా ముఖ్యమైనదని అన్నారు. ఈ భవనం నుంచి ప్రతీ అంశాన్ని మనం ప్రేరణగా తీసుకోవాలని సూచించారు. కాగా, ఈ ప్రత్యేక సమావేశాల్లో 75 ఏళ్ల ప్రస్థానంతోపాటు, సాధించిన విజ‌యాలు, అనుభ‌వాలపై తొలి రోజు చ‌ర్చతోపాటు.. ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశపెట్టనుంది. అయితే, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు. భారత్ 2047లో అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


Next Story

Most Viewed