రైతులకు ప్రధాని మోడీ శుభవార్త.. పీఎం కిసాన్ యోజన డబ్బుల విడుదల టైమ్ ఫిక్స్

by Anjali |
రైతులకు ప్రధాని మోడీ శుభవార్త..  పీఎం కిసాన్ యోజన డబ్బుల విడుదల టైమ్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు మోడీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెలాఖరులోగా 17వ విడత పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయని మోడీ ప్రమాణ స్వీకారం తర్వాత మరుసటి రోజు సోమవారం సాయంత్రం ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సంబంధిత ఫైల్‌పై మోదీ సంతకం పెట్టారు. దీంతో పీఎం కిసాన్ పథకంలో భాగంగా దేశంలోని 9.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు చొప్పున దాదాపు రూ.20 వేల కోట్లు జమకానున్నాయి.ఈ నెలాఖరులోగా 17వ విడత పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే మోడీ రైతులకు భారీ గుడ్‌న్యూస్ అందించడంతో రైతులు హర్హం వ్యక్తం చేస్తున్నారు. ఇక చివరిసారిగా రైతుల ఖాతాల్లో 16 వ విడత సొమ్ము ఫిబ్రవరిలో జమ అయింది. ఇప్పుడు 17 వ విడత డబ్బు రైతుల అకౌంట్లలోకి బదిలీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Next Story

Most Viewed