పెళ్లికి ముందే అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ టెస్ట్.. నలుగురికి గర్భం.. సీఎంపై తీవ్ర విమర్శలు

by Disha Web Desk 7 |
పెళ్లికి ముందే అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ టెస్ట్.. నలుగురికి గర్భం.. సీఎంపై తీవ్ర విమర్శలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆడపిల్ల పెళ్లి అంటే మధ్యతరగతి కుటుంభాలకు పెద్ద భారం. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి కూడా పెళ్లి గురించి కంగారు పడుతూనే ఉంటారు. కొంతమంది ఆడపిల్ల పుట్టిందంటేనే వారిని చదివించాలి, పెళ్లి చేయాలి ఇలా వారితో మొత్తం ఖర్చులే ఉంటాయి అన్నట్లు పురిట్లోనే వాళ్లని చంపేస్తున్నారు. ఇలాంటి నిరుపేద కుటుంభాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు ఏన్నో స్కీమ్‌లు తీసుకొచ్చాయి.

ఆడ పిల్ల పుట్టిన వారికి ఫిక్సడ్ డిపాజిట్.. వారి చదువులకు స్కాలర్ షిప్స్ అలాగే పెళ్లికి సంబంధించి ఖర్చుల నిమిత్తం డబ్బులు ఇవ్వడం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయి ప్రభుత్వాలు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజలు మండిపడుతున్నారు. ఇంతకు ఆ ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయం ఏంటో తెలుసుకుందాం..

ఆడపిల్లల పెళ్లిల నిమిత్తం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ‘CM కన్యా వివాహ యోజన’ అనే పథకం తీసుకొచ్చింది. ఈ పథకం దరఖాస్తు చేసుకున్న నిరుపేద యువతులకు ప్రభుత్వం పెళ్లి చేస్తుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. ఈ ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయం కారణంగా ప్రజలు మండిపడుతున్నారు. దరఖాస్తు నిమిత్తం పెళ్లిళ్లు చేసుకునే కొందరు అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ టెస్టులు చేశారు.

ఫలితాల్లో నలుగురు గర్భవతులని తేలడంతో వివాదం చెలరేగింది. పెళ్లి కావాల్సిన ఆడపిల్లలకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం వారిని తీవ్రంగా అవమానించడమేనని ప్రజలతో పాటు ప్రతిపక్షాలు సైతం ఆ రాష్ట్ర సీఎంపై మండిపడుతున్నారు. కాగా.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘CM కన్యా వివాహ యోజన’ పథకం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.



Next Story

Most Viewed