- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Jan Suraaj Party : జన్ సురాజ్ పార్టీని ప్రారంభించిన పీకే
దిశ, నేషనల్ బ్యూరో : ప్రశాంత్ కిశోర్ తన రాజకీయ పార్టీ ‘జన్ సురాజ్’ను బుధవారం గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించారు. బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమం వేదికగా పార్టీ ఏర్పాటుపై ఆయన అధికారిక ప్రకటన చేశారు. ఈసందర్భంగా తమ పార్టీ శ్రేణులతో ప్రశాంత్ కిశోర్ జై బిహార్ నినాదాలు చేయించారు. బిహారీ ప్రజలపై వేధింపులు జరుగుతున్న రాష్ట్రాల దాకా వినిపించేలా ఈ నినాదాలు ఉండాలని పార్టీ క్యాడర్‌కు ఆయన సూచించారు. బిహారీ అని పిలిపించుకోవడానికి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు గర్వించాలన్నారు. బిహారీల గళం ఢిల్లీ దాకా వినిపించేలా చేయడమే జన్ సురాజ్ పార్టీ ప్రధాన లక్ష్యమని ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు.
‘‘జన్ సురాజ్ పార్టీ క్యాడర్ గొంతుక బెంగాల్ దాకా చేరాలి. ఎందుకంటే అక్కడ బిహారీ విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. బిహారీ యువతపై దాడులు జరుగుతున్న బాంబే, ఢిల్లీ, తమిళనాడులకు కూడా మన గళం వినిపించాలి’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘లాలూ ప్రసాద్ లాంటి వాళ్లను కాదనుకొని మరో దారి లేక 25-30 ఏళ్లలోపు యూత్ బీజేపీకి ఓటు వేశారు. రాష్ట్ర యువత సరైన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్నారు. ఆ ప్రత్యామ్నాయం కచ్చితంగా మేమే. బిహారీలను ఏకం చేసే వేదికగా మా పార్టీ నిలుస్తుంది’’ అని గతనెల 30న ప్రసంగిస్తూ పీకే కామెంట్స్ చేశారు.
‘జన్ సురాజ్’ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మనోజ్ భారతి
జన్ సురాజ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మనోజ్ భారతిని నియమిస్తున్నట్లు ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. మనోజ్ బిహార్‌లోని మధుబని వాస్తవ్యుడు. జార్ఖండ్‌లోని నెతార్‌హాత్ ప్రాంతంలో ఆయన చదువుకున్నారు. ఐఐటీ కాన్పూర్‌లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఐఐటీ ఢిల్లీలో ఎంటెక్ చేశారు. ఇండియన్ ఫారిన్ సర్వీసులోనూ మనోజ్ భారతి సేవలు అందించారు. ఇందులో భాగంగా ఉక్రెయిన్, బెలారస్, తైమూర్, ఇండోనేషియాలలో భారత రాయబారిగా ఈయన వ్యవహరించారు.