రేవ్ పార్టీ కేసు..జైలు నుంచి విడుదలైన ప్రముఖ నటి

by Jakkula Mamatha |
రేవ్ పార్టీ కేసు..జైలు నుంచి విడుదలైన ప్రముఖ నటి
X

దిశ,వెబ్‌డెస్క్: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ప్రముఖ సినీ నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రేవ్ పార్టీలో నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఆమెను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమె బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని, అలాగే ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని ఆమె తరఫున అడ్వకేట్ కోర్టులో వాదించారు. ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు చూపించలేకపోయారు అన్నారు. ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను సీసీబీ కోర్టుకు అందించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం హేమకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆమె ఈరోజు (శుక్రవారం) విడుదలయ్యారు.Next Story

Most Viewed