Swachh Bharat: స్వచ్ఛతా అభియాన్ కి పదేళ్లు పూర్తి.. అందరూ పాల్గొనాలన్న మోడీ

by Shamantha N |   ( Updated:2024-10-02 09:19:35.0  )
Swachh Bharat: స్వచ్ఛతా అభియాన్ కి పదేళ్లు పూర్తి.. అందరూ పాల్గొనాలన్న మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చి స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి పదేళ్లు పూర్తయ్యాయి. కాగా.. గాంధీ జయంతి సందర్భంగా చిన్నారులతో కలిసి స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనాలని మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టారు. ‘నేను, నా యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛత అభియాన్ లో భాగస్వామినయ్యాను. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నా. ఈ చొరవ స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుంది’ అని మోడీ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో స్వచ్ఛతా హీ సేవా 2024 కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశుభ్రతకు సంబంధించి రూ.9600 కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మహాత్మా గాంధీ కలలుగన్న పరిశుభ్ర భారతదేశాన్ని లక్ష్యంగా దేశవ్యాప్తంగా ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని గాంధీ జయంతి సందర్భంగా 2014, అక్టోబర్ 2 న మోడీ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed