- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
#10YearsOfSwachhBharat: స్వచ్ఛ భారత్ కు పదేళ్లు.. విద్యార్థులతో కలిసి చెత్త ఊడ్చిన ప్రధాని
దిశ, వెబ్ డెస్క్: పరిసరాల శుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం.. నేటితో పదేళ్లు పూర్తి చేసుకుంది. మన పరిసరాలను మనమే శుభ్రం చేసుకోవాలన్న సంకల్పంతో అక్టోబర్ 2, 2014న గాంధీ జయంతిని పురస్కరించుకుని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా మోదీ.. స్కూల్ విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ X లో ఒక పోస్ట్ చేశారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. "నా యువమిత్రులతో కలిసి స్వచ్ఛతా ప్రచారంలో భాగమయ్యాను. మీరు కూడా మీ పరిసరాల పరిశుభ్రతలో భాగం కండి. ఇది క్లీన్ ఇండియా (Clean India) స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుంది" అని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.
ప్రధాని పిలుపుతో.. దేశంలో పలువురు రాజకీయ నాయకులు స్వచ్ఛ అభియాన్ లో పాల్గొన్నారు. కేంద్రమంత్రులు జేపీ నడ్డా, రాజివ్ రంజన్, కిషన్ రెడ్డి, ముఖేశ్ మాండవీయ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లు స్వచ్ఛ అభియాన్ లో భాగమయ్యారు. ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతాహి కార్యక్రమంలో పాల్గొన్నారు.
गांधी जयंती पर आज अपने युवा साथियों के साथ स्वच्छता आभियान का हिस्सा बना। मेरा आप सभी से आग्रह है कि आज आप भी अपने आसपास स्वच्छता से जुड़ी मुहिम का हिस्सा जरूर बनें। आपकी इस पहल से 'स्वच्छ भारत' की भावना और मजबूत होगी। #10YearsOfSwachhBharat pic.twitter.com/MvjhazPAvl
— Narendra Modi (@narendramodi) October 2, 2024